కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. పాఠశాలల్లో అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మండలంలోని జప్తి జాన్కంపల్లిలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా కరువైంది. విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఇంటి భోజనమే దిక్కయింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున పూట వంట కాక, కారం మెతుకులు తిని వస్తున్న పిల్లలకు మధ్యాహ్నం లంచ్ బాక్సులో కూడా అదే తొక్కు అన్నం పెడుతుండడంతో తినలేక పోతున్నారు.
-నాగిరెడ్డిపేట, డిసెంబర్ 30
కేసీఆర్ పాలనలో ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టే వారు. సన్నబియ్యంతో ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించే వారు. కానీ, కాంగ్రెస్ రాకతో విద్యావ్యవస్థ గాడి తప్పింది. విద్యార్థులను పట్టించుకునే వారే కరువయ్యారు. దాదాపు ఆర్నెళ్లుగా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టలేక సమస్యను తీర్చే వారు లేకుండా పోయారు. జప్తిజాన్కంపల్లి ప్రాథమకొన్నత పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదవుతున్న వీరికి విద్యాసంవత్సరం ఆరంభం నుంచి మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు. దీంతో పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఉదయం వేళ వంట కాకపోవడంతో పచ్చడి మెతుకులు తిని వస్తున్నారు.
అవే కారం మెతుకులను బాక్సుల్లో తెచ్చుకుంటున్నారు. రెండుపూటలా పచ్చడితో తినలేక సతమతమవుతున్నారు. మరికొందరేమో మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్తుండగా, ఇంకొందరు సాయంత్రం వరకూ ఖాళీ కడుపులతోనే ఉంటున్నారు. మరోవైపు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించరించేందుకు గ్రామస్తులతో కలిసి పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశామని, కానీ వంట చేసేందుకు ఎవరూ రావడం లేదంటున్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వారు స్పందించి మధ్యాహ్న భోజనం పెట్టించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కామారెడ్డి, డిసెంబర్ 30: కామారెడ్డి అడిషనల్ ఎస్పీగా బొక్క చైతన్యారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ విభాగంలో ఏఎస్పీగా ఉన్న 2022 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమెను కామారెడ్డికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇన్చార్జి అడిషనల్ ఎస్పీగా ఉన్న నర్సింహారెడ్డి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
మధ్యాహ్న భోజనం పెడుతలేరు. ఇంటి నుంచి బాక్సు తెచ్చుకుంటున్నాం. పొద్దున వంట కాక పచ్చడితో తిని టిఫిన్ తెచ్చుకుంటున్నాం. కొందరు మధ్యాహ్నం ఇంటికెళ్తే, కొందరు ఖాళీ కడుపుతోనే ఉంటున్నారు. – గోవర్ధన్, ఆరో తరగతి
ఏజెన్సీ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో భోజనం పెట్టడం లేదు. గ్రామస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసినా లాభం లేదు. ఆగస్టులో ఒకరొచ్చినా వారం తర్వాత మానేశారు. త్వరలోనే మధ్యాహ్న భోజనం పెట్టించేందుకు ఏర్పాటు చేస్తాం.
– అనసూజ, హెడ్మాస్టర్