Banswada | బాన్సువాడ, జులై 13 : బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు. గత రెండు, మూడు రోజుల క్రితం ఆసుపత్రికి ఆపరేషన్ల కోసం వచ్చిన బాలింతలకు వైద్యం వికటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు బాలింతలను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం పంపినట్లు తెలుస్తోంది.
బాన్సువాడ ఆసుపత్రి నుండి జిల్లా ఆసుపత్రికి తరలించడం తో కుటుంబీకులు ఆందోళన లో ఉన్నారు. ఇదే విషయం పై ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ భాస్కర్ కు వివరణ కోరగా ఆపరేషన్ కోసం వచ్చిన వారికి ఆపరేషన్ అనంతరం ప్లేట్ లెట్ కౌంట్స్ పడిపోయాయని తెలిపారు. వారిని చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపామని తెలిపారు. నిజామాబాద్ ఆసుపత్రిలో వారిని చికిత్స కోసం అక్కడే ఉన్నట్లు తెలిపారు.