Banswada | బాన్సువాడ రూరల్, జూన్ 12 : వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని గ్రామ బోర్లం క్యాంపు సర్పంచ్ కుంటోల్ల లక్ష్మి అన్నారు. గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్యపు పనులను వార్డు సభ్యుడు హరికృష్ణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్త, చెదారాన్ని పూర్తిగా తొలగించాలని కార్మికులకు ఆమె సూచించారు.
గ్రామస్తులు ఇంట్లో సేకరించిన చెత్తను రోడ్లపై పారవేయకుండా డస్ట్ బిన్ లో నిలువచేసి ప్రతీరోజు ఇంటి ముందుకు వచ్చే గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో చెత్తను వేయాలని ఆమె గ్రామస్తులకు సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయడం వల్ల దోమల బెడద ఎక్కువ అవుతుందని, వాటి వల్ల గ్రామస్తులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.