వినాయక నగర్,మార్చి;-18 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోదాలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సీఐ అంజయ్య వన్ టౌన్ పరిధిలో రైడింగ్ చేశారు. స్థానిక మిర్చి కాంపౌండ్ ఏరియాలో ఓ బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 75 క్వింటాళ్లు సుమారు రూ. రెండు లక్షల 45 వేలు విలువ చేసే పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.
రైస్ తో పాటు వాహనాన్ని సీజ్ చేసి, సంబంధిత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ ఓ కు తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లుగా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.