108 Pilot Day | పోతంగల్ మే 26: మండల కేంద్రంలో 108 పైలట్ దినోత్సవం సందర్భంగా మండల బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమచారమందిన వెంటనే బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నరని తెలిపారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో ఫైలట్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు. విఫత్కర సమయాల్లో 108 అంబులెన్స్‌లో సమర్ధవంతంగా సేవలను అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటంలో పైలట్లు ముందుంటున్నట్లు పేర్కొన్నారు.