Angawadis | సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలి : అంగన్ వాడీ టీచర్
Anganwadis | మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని అంగన్వాడీలు వాపోయారు.
Angawadis | తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా..? ఆంగ్లేయుల పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదని అంగన్ వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కేవలం అంగన్వాడీల కోసం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను అడగడానికి వచ్చాము. మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని అంగన్వాడీలు వాపోయారు.
ఆందోళన సందర్భంగా ఓ అంగన్ వాడీ టీచర్ మాట్లాడుతూ..మమ్మల్ని ఒక దగ్గర కూర్చొని ధర్నా చేసుకోనిస్తలేరు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఉండనిస్తలేరు. మేమేం మాకు విలాసాలకు కావాల్సిన కోరికలు అడగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ను మాత్రమే అడగడానికొచ్చాం. ఆ డిమాండ్స్‌కు ఒప్పుకుంటారా..? ఒప్పుకోరా.. ? ఇస్తారా.. ? ఇవ్వరా అని ప్రశ్నించింది. అంగన్ వాడీ కేంద్రాలకే జీతాలు సరిగా లేవని మేం ఏడుస్తుంటే ప్రీ ప్రైమరీ అని మళ్లీ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
మా డిమాండ్స్‌ను ఒప్పుకోకుంటే మాత్రం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలి. సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా కూడా ఆ కుర్చీకి విలువ లేదు. ఆడవాళ్ల ఉసురు ముట్టి నాశనమైపోతరని మండిపడ్డది. . 24 రోజుల జీతం ఇంతకుముందు మా అంగన్వాడీలకు కట్ చేశారు. ఆ జీతాన్ని ఇస్తమని కూడా ఒప్పుకున్నరని అంగన్ వాడీ టీచర్ గుర్తు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? ఆంగ్లేయుల పాలనలో ఉన్నామో అర్థం కావడం లేదు
మేము కేవలం అంగన్వాడీల కోసం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను అడగడానికి వచ్చాము
మా డిమాండ్స్ ఒప్పుకోకపోతే రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలి
మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం… pic.twitter.com/AYw8eesqnD
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2026
Read Also :
పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న కేంద్రం : పోలేపల్లి ఉదయ్‌కుమార్
Telangana Assembly | ఈనెల 30 వరకు అసెంబ్లీ, మండలి సమావేశాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

