Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీకి మాస్కోలో చికిత్స !.. ఖర్గ్ దీవికి అమెరికా సైనిక బలగాలు !
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీకి మాస్కోలో చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు.. ద్రువీకరించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ దళాల దాడిలో మొజ్తాబా గాయపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు ఖర్గ్ దీవిని ఆక్రమించేందుకు సైనిక బలగాలను పంపే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది.
మాస్కో: ఇరాన్ సుప్రీం నేతగా మొజ్తాబా ఖమేనీ(Mojtaba Khamenei) ఎన్నికైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన నేపథ్యంలో కొత్త నేతను ఎన్నుకున్నారు. అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తాబా ఆ రోజు జరిగిన దాడిలో గాయపడినట్లు తెలిసిందే. అయితే మొజ్తాబాకు ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో వైద్య చికిత్స జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కువైట్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వెలుబడ్డాయి. ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ చికిత్స కోసం మాస్కో చేరుకున్నట్లు కువైట్ మీడియా వెల్లడించింది. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఈ వార్తలపై ఎటువంటి కన్ఫర్మేషన్ కానీ ఖండన కానీ చేయలేదు. ఇలాంటి వార్తలపై తాము ఎప్పుడూ కామెంట్ చేయబోమని ఆయన అన్నారు. తమ వైమానిక దాడిలో మొజ్తాబాకు గాయాలయ్యాయని కొన్ని రోజుల క్రితం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో వైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. తమ సైనిక బలగాలను ఖర్గ్ దీవికి పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఖర్గ్ దీవిలో ఉన్న ఇరానీ మిలిటరీ కేంద్రాలను అమెరికా వైమానిక దళాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ చమురు సరఫరాకు కీలకమైన టర్మినల్‌గా ఖర్గ్ దీవి వ్యవహరిస్తోంది. అయితే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఆ దీవిపై దాడి చేశారు. ఆ దీవి నుంచి ఇరాన్ సుమాఉ 90 శాతం ఇంధనాన్ని ఎగుమతి చేస్తుంది. ఒకవేళ ఖర్గ్ దీవికి అమెరికా తన బలగాలను పంపిస్తే, అప్పుడు గల్ఫ్ పరిస్థితులు మరింత భీకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు ఇరాన్ మరింత విస్తృతంగా అమెరికాకు సంబంధం ఉన్న ఆయిల్ కంపెనీలపై దాడి చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- invade
- iran
- Israel
- Kharg Island
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

