Hanging | నిజామాబాద్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు.
- దుర్వాసన రావడంతో డయల్ 100 సమాచారం ఇచ్చిన స్థానికులు
Hanging | వినాయక నగర్, జూలై 9 : నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో ఇంట్లోంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచామందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని, బ్లాక్ నెంబర్ 13/2లో పై అంతస్తులు ఉండే జగదీష్ ఇంటి తలుపులను లోబడి నుండి పెట్టుకొని ఉండడంతో పోలీసులు స్థానికుల సహాయంతో డోర్లను తెరిచి చూశారు. ఆ ఇంట్లో మొదటి గదిలో ఆయన ఫ్యాన్ కు ఉరివేసుకొని వేలాడుతూ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య గత కొంత గీతం చనిపోవడం, అప్పటినుండి ఆయన ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని మృతుడి తమ్ముడైన మహేందర్కు పోలీసులు ఫోన్ చేసి సమాచారమందించారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమిటన్న విషయం తెలియ రాలేదు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

