మోర్తాడ్/ఆర్మూర్‌టౌన్, జూన్ 20 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. శనివారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్‌కు ఇందల్వాయి వద్ద మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి జగన్, ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు.

పోచంపాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.