‘ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్తో మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాను. ఇందులో నేను రెండు పర్సనాలిటీస్‌తో కనిపిస్తా. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ వుంటాయి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. దీనికోసం డైరెక్టర్‌తో కలిసి ఎంతో హోమ్‌వర్క్ చేశాను. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర దొరికింది. నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఇందులోని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా నేచురల్‌గా ఉంటాయి’ అని హీరో వరుణ్‌తేజ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయిక. మేర్లపాక గాంధీ దర్శకుడు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాట్లాడారు. ఆడియన్స్‌కి ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని కథానాయిక రితికా నాయక్ చెప్పారు. ట్రైలర్ అందరికీ నచ్చినందుకు ఆనందంగా ఉందని, సినిమాలో అంతకు మించి ఫన్ ఉంటుందని, వరుణ్, రితికా, సత్య పెర్ఫార్మెన్స్ని ప్రేక్షకులు ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తారని దర్శకుడు మేర్లపాక గాంధీ తెలిపారు. ఇంకా సత్య, డీవోపీ మనోజ్ కూడా మాట్లాడారు. హారర్, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ట్రైలర్ సాగింది.