హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ మెప్పు కోసమే మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తాంత్రిక పూజలంటూ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేత సత్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అద్దంకికి పదవి రాగానే అహం పెరిగిందని, రేవంత్ పక్కన చేరగానే చిన్న మెదడు దెబ్బతిని మతిపోయిందని దెప్పి పొడిచారు. క్షుద్ర పూజలు చేస్తే అన్ని జరిగిపోతాయా..? వర్షాలు ఆగిపోతాయా? ఇదే నిజమైతే తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమించినట్టు? తాంత్రిక పూజలు చేస్తే సరిపోయేది కదా..అంటూ పేర్కొన్నారు. తాంత్రిక విద్యలు నేర్చుకునేందుకే రేవంత్ నిన్ను అమెరికా పంపించారా అంటూ ప్రశ్నించారు.
దమ్ముంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లతో రేవంత్‌రెడ్డిని వీరుడు, శూరుడు అని చెప్పించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని బీజేపీ కోసమే ఆరాటపడుతున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాటలు అక్షరసత్యమని స్పష్టంచేశారు. బీజేపీ మనిషికి అద్ధంకి వంతపాడటం విడ్డూరమని విమర్శించారు. ఆయన అద్దంకి దయాకర్ కాదని.. అజ్ఞానపు దయాకర్ అని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు లాంటి పెద్ద నాయకుడిని తిడితే పెద్దవాడవుతానని అద్ధంకి దయాకర్ అనుకొంటే అంతకంటే పిచ్చి ఇంకొకటి లేదని చురకలంటించారు. క్షుద్ర పూజలతో ఫలితముంటే రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసుకోవాలని దెప్పిపొడిచారు. మ రోసారి హరీశ్‌రావుపై అవాకులు చేవాకులు పేలితే ఊరుకొనేదిలేదని, అవసరమైతే న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేత గౌతమ్‌ప్రసాద్ మాట్లాడుతూ రేవంత్ ఏం ఉద్ధరిస్తున్నారని బీఆర్ఎస్ క్షుద్ర పూజలు చేయిస్తుందని ప్రశ్నించారు. దే శంలోనే అత్యధికంగా 86 క్రిమినల్ కేసులున్న ఏకైక సీఎంగా రేవంత్ ఘనత వహించారని వి మర్శించారు. అసలు రాష్ట్రంలో రేవంత్‌ను మించిన సైకో మరెవరైనా ఉన్నారా? అంబేద్కర్‌ను విశ్వసించేవారెవరైనా క్షుద్ర పూజలను న మ్ముతారా? అని నిలదీశారు. రేవంత్ ఇచ్చే కూ లీ కోసం హరీశ్‌రావుపై ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంటే సహించబోమని హెచ్చరించారు.