US weapons | అంతరిక్షంలో మా వద్ద ఆయుధాలున్నాయ్.. తొలిసారి అమెరికా బహిరంగ ప్రకటన..!
US weapons | అంతరిక్షం (SPace) లో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా (US) తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ‘స్పేస్ కంట్రోల్ వెపన్స్ (Space Control Weapons)’ కక్ష్యలో ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ (US Space Force) వెల్లడించింది. శత్రు దేశాల దాడుల నుంచి అమెరికా, మిత్రదేశాల బలగాలను రక్షించేందుకే వీటిని మోహరించినట్లు తెలిపింది.
US weapons : అంతరిక్షం (SPace) లో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా (US) తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ‘స్పేస్ కంట్రోల్ వెపన్స్ (Space Control Weapons)’ కక్ష్యలో ఉన్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ (US Space Force) వెల్లడించింది. శత్రు దేశాల దాడుల నుంచి అమెరికా, మిత్రదేశాల బలగాలను రక్షించేందుకే వీటిని మోహరించినట్లు తెలిపింది. అయితే ఆయుధాల సంఖ్య, వాటి స్థానం, ఏ తరహా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారన్న వివరాలను మాత్రం బయటపెట్టలేదు.
అమెరికా ఎయిర్‌ఫోర్స్ కార్యదర్శి ట్రాయ్ మెయింక్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా సాయుధ బలగాలపై శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను మరింత పెంచుతున్నామని చెప్పారు. ప్రస్తుతం కక్ష్యలోనే శత్రు చర్యలను ఎదుర్కోగల అంతరిక్ష ఆయుధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ ఆయుధాలు ‘కైనెటిక్, నాన్-కైనెటిక్’ విధానాల్లో పనిచేయగలవని స్పేస్ ఫోర్స్ తెలిపింది. అవసరాన్ని బట్టి రక్షణతోపాటు దాడి చర్యల్లోనూ వీటిని ఉపయోగించవచ్చని పేర్కొన్నది.
అయితే అవి ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆయుధాలా, ఇతర రకాల వ్యవస్థలా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. అంతరిక్ష రంగంలో చైనా, రష్యాల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా భావిస్తోంది. ఉపగ్రహాలు సైనిక కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్‌కు కీలకం కావడంతో వాటిపై ఆధిపత్యం భవిష్యత్ యుద్ధాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమెరికా తొలిసారి కక్ష్యలో ఆయుధాల ఉనికిని బహిరంగంగా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీ అంతరిక్షంలో సామూహిక విధ్వంసక ఆయుధాల మోహరింపును నిషేధిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

