వేయిస్తంభాల దేవాలయంలో వైభవంగా గణపతి నవరాత్రోత్సవాలు
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాగణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాగణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. చారిత్రక రుద్రేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో కొలువుదీరిన మహాగణపతిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని శాస్త్రోక్తంగా పూజలు చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, మహాగణపతిని పూజించడం వలన ప్రకృతి సహకరిస్తుందని, ‘ప్రకృతిని ప్రేమించు పర్యావరణాన్ని రక్షించు’ అనే భావనతో భక్తులు పూజలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, ఈవో డి.అనిల్‌కుమార్, ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు గట్టు మహేష్‌బాబు, అర్చకులు గంగు మణికంఠశర్మ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

