బాల్కొండ, నవంబర్ 9: బాల్కొండలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు స్థానికులు శనివారం క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఫంక్షన్‌హాల్ నుంచి మల్లన్నగుట్ట మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.2.65 కోట్లను విడుదల చేశారు.
తాజాగా నిర్మాణ పనులు పూర్తి కావడంతో స్థానికులు కేసీఆర్, వేముల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్‌యాదవ్, నేతలు సూరజ్‌రెడ్డి, బూస నరహరి, కన్న పోశెట్టి, ఫయాజ్‌అలీ, ఎంఏ.షహీద్, చిన్న బాలరాజేశ్వర్, ప్రసాద్‌గౌడ్, గాండ్ల రాజేశ్, ధర్మాయి రాజేందర్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.