మాచారెడ్డి, నవంబర్ 1 : పదేండ్ల కేసీఆర్ పాలనను ఆ తండాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మాయమాటల కాంగ్రెస్ను నమ్మి తండ్రిలాంటి కేసీఆర్ను దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట గ్రామంలోని వివిధ గ్రామ తండాల ప్రజలు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సారే కావాలి.. కారే రావాలి అంటూ నినాదాలు చేశారు. పది నెలల కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతుభరోసా లేదని, రుణమాఫీ కాలేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడంలేదని మండిపడ్డారు. ఆసరా పింఛన్లు పెంచకపోగా..ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు చేసింది శూన్యమని అన్నారు.