Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి కి బదిలీ పై వచ్చిన ఎస్సై సునీల్ ను పాతంగల్ మండలం జల్లాపల్లి అబాది బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరీఫ్, ఏజాస్, షాదుల్, సద్దాం, ఫెరోస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.