కోటగిరి, అక్టోబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్ గురించి స్వస్థత ఇవ్వలేదని, బోనస్ విషయంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కాబట్టి ప్రభుత్వం బోనస్ విషయంలో వెంటనే స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
గత సీజన్ పంటకు సంబంధించిన బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట పొతంగల్ – కోటగిరి ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. రైతులకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతుల తరుపున రైతులు తెల్ల రవికుమార్, ఏముల నవీన్ మాట్లాడుతూ గత రబీ సీజన్లో ఆరుకాలం కష్టపడి రైతులు వరి పంటను పండించారని, మండుటెండలను సైతం లెక్కచేయకుండా బోనస్‌పై ఆశతో ఎండలో వడ్లను ఆరబెట్టారని, ప్రభుత్వము ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించారని, కానీ రైతులు వడ్లు విక్రయించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రైతులకు బోనస్ చెల్లించలేదని మండిపడ్డారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు చెల్లించాల్సిన బోనస్ విషయంలో తమకు న్యాయం చేయాలని తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి -పోతంగల్ ప్రధాన రహదారిపై మండుటెండలో రోడ్డు పైన బైటయించారు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు భరోసా కలిగేలా హామీ ఇవ్వాలని అప్పుడే ఆందోళన విరమిస్తామని లేకపోతే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసిల్దార్ గంగాధర్ ఇంచార్జ్ ఎస్ఐ సాయన్న ఘటన స్థలానికి చేరుకున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోనస్ విషయంలో భరోసా కల్పించాలని, బోనస్ పట్ల తమకు ఎన్ని రోజుల్లో స్పష్టత ఇస్తారని చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల బోనస్ విషయంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మూడు రోజులు బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు. మంగళవారం లోపు స్వస్థత ఇవ్వకుంటే బుధవారం రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ప్రస్తుత సీజన్లో కూడా కొనుగోలు కేంద్రాల్లో రైతుల దగ్గర నుంచి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ గంగాధర్ కు రైతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు మామిడి శ్రీనివాస్, మామిడి అశోక్, పాకాల లక్ష్మణ్, మోహన్ రావు, భవానీపేట్ శ్రీనివాస, రమణ, ప్రభాకర్, వాసుబాబు, శ్రీనివాస రావు. ఏముల నవీన్, రవికుమార్, అరవింద్, గంగప్రసాద్ గౌడ్, మామిడి సాయిలు తదితరులు ఉన్నారు.