కామారెడ్డి/ ఖలీల్వాడి, మే 4 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం కంటివెలుగు శిబిరాలు కొనసాగాయని, 44 బృందాలతో 5,171 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 387 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ సింగ్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు 3,72,655 మందికి పరీక్షలు నిర్వహించి, 54,239 మంది కళ్లద్దాలను పంపిణీ చేశామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం 7,985 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 659 కంటి అద్దాలను అందజేశామని డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 5,31,168 మందికి పరీక్షలు నిర్వహించి, 85,077 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశామని వివరించారు.