కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy) పరిధిలోని రామేశ్వరపల్లి శివారులో ఉన్న పల్లెవారి కుంటలో విషాదం నెలకొంది. ప్రమాదవశాస్తు ఇద్దరు చిన్నారులు పల్లె వారి కుంటలో మునిగి మృతి చెందారు. చిన్నారులను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలో నివాసం ఉండే 10 సంవత్సరాల వయసు గల సంతోష్, శివలుగా గుర్తించారు. గ్రీన్ సిటీలో నివాసముండే చిన్నారులు సంతోశ్, శివ ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలో సైకిల్ తొక్కుకుంటూ సమీపంలో గల పల్లెవారి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాస్తు కుంటలో పడి సంతోష్, శివా మృతి చెందారు. గమనించిన స్థానికులు వారిని అందులోని కాపాడేలోపే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.