మాచారెడ్డి : మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నరసింహ హోమం(Sudarshana Narasimha Homam) నిర్వహించారు. ఈ హోమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రతి నెల స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజు ఈ సుదర్శన నరసింహ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సరిహద్దు జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీధర్ రావు, ఆలయ సిబ్బంది సంతోష్, అర్చకులు శ్రీనివాసచార్యులు, పరందామాచార్యులు, నరసింహచార్యులు, సంజీవాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.