గాంధారి, మార్చి11 : గిరిజన సంప్రదాయానికి ప్రతీకైనా లెంగి హోలీ వేడుకను మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయం ప్రాంగణంలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నృత్యం చేశారు. హోలీ లెంగి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. గిరిజనులు తమ సాంప్రదాయ వేడుకైన లెంగి హోలీ పండుగను అందరూ కలిసి జరుపుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. గిరిజన సంప్రదాయ ఆచారాలకు లెంగి హోలీ పండుగ అద్దం పడుతుందని తెలిపారు. ఈ వేడుకను మండలంలోని అన్ని తండాలకు చెందిన గిరిజనులు ఒకే చోట జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ సంప్రదాయ పాటలను పాడుతూ, నృత్యాలు చేశారు.