న్యూఢిల్లీ: రణగొణ ధ్వనులు, వాగ్వాదాలు, ప్రసంగాలతో కన్పించే రాజ్యసభలో బుధవారం ఎంపీగా పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాస్యోక్తులతో సభ నిండిపోయింది. రాజ్యసభలో తన వీడ్కోలు ప్రసంగంలో బుధవారం ఖర్గే మాట్లాడుతూ దేవెగౌడ ప్రధాని గానే కాక, పలు పదవులను అలంకరించారని తెలిపారు. ‘ఆయన నాకు 54 ఏండ్లుగా తెలుసు, ఆయనతో పనిచేశాను కూడా. అయితే ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు.
అతను మాతో డేట్ చేశారు, ప్రేమించారు, కానీ నరేంద్ర మోదీని పెండ్లి చేసుకున్నారు’ అని ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. రాజ్యసభలో ఉన్న ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలు విని నవ్వారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై దేవెగౌడ స్పందించారు. కాంగ్రెస్తో బలవంతంగానే కలవాల్సి వచ్చిందని, అదో హింసాత్మక బంధమని, అందుకే విడిపోవాల్సి వచ్చిందన్నారు.