కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. నేటి పర్యటన సందర్భంగా బీబీపేటలో జడ్పీ పాఠశాల భవనాలను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం కామారెడ్డిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు.
కాగా, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లో అధికారిక కార్యక్రమాలతో పాటు, పార్టీ కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్‌రోడ్డు, వరంగల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్, హనుమకొండ జంట నగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా ఉన్న రైల్వేట్రాక్‌ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మా ణం, తదితర అంశాలపై సమీక్ష జరిపి, మంజూరు చేయనున్నారు.