కామారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి చెందిన బీజేవైఎం నాయకులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసాలను సహించలేకనే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ ,బొంబాయి సాయి ప్రమోద్ రెడ్డి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడికింది చంద్రకాంత్, కోశాధికారి సాయి, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మాజీద్, యూత్ నాయకులు బాబా గౌడ్, సమీర్, సాయి, బషీర్, అమాన్ తదితరులు ఉన్నారు.