బాన్సువాడ రూరల్, జూన్ 19: బాన్సువాడ మండలంలోని సంగోజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిమ్యానాయక్ తాండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణానికి గ్రామపెద్దలు భూమిపూజ చేశారు. ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో నాగభూషణం, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.