kamareddy | కామారెడ్డి, బిబిపెట్, ఏప్రిల్ 23 : గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతే రాజు అనే విధంగా మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీఆర్ఎస్ యూత్ విభాగం మండల నాయకులు మహేష్ యాదవ్ అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, రైతు బీమా, రైతుబంధు, అసరా పింఛన్ లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి సకల వర్గాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.
కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారం చేపట్టి 17 నెలలు కావస్తున్నా మహిళలకు, యువతతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.