మద్నూర్: మద్నూర్ మండల కేంద్రం నుంచి నసురుల్లాబాద్ మండలం నెమలి సాయిబాబా ఆలయానికి భక్తులు పాదయాత్రగా (Padayatra) తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం మద్నూర్లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి చేసి బాబా పల్లకి వెంట నడుచుకుంటూ వెళ్లారు. సుమారు 400 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు.
వారికి దారి పోడువున ఆయా గ్రామాల భక్తులు అల్పాహారంతో పాటు పాలు, ఫలహారాలు, తాగునీరు, మజ్జిగ, భోజనం, తదితర ఏర్పాట్లను చేశారు. సాయంత్రం నెమలి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణంలో వీరిని మద్నూర్ తీసుకురావడానికి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అక్కడి నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.