బాన్సువాడ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై (MLC Theenmar Mallanna) బాన్సువాడ పోలీస్ స్టేషన్లో (Banswada Police Staions) శుక్రవారం రెడ్డి సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు వాసన అశోక్ రెడ్డి మాట్లాడుతూ చింతపండు నవీన్ అలియాస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల వరంగల్ సభలో ( Warangal Meeting) రెడ్డి కులస్తులపై ( Reddy Casts) చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్న తన స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం రెడ్డిలపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రెడ్డి సంఘ సభ్యులను దూషించడం సబబు కాదని, మల్లన్న పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ రెడ్డి సంఘం కార్యదర్శి పాశం రాజిరెడ్డి, ర్యాల నరసింహ రెడ్డి , లక్ష్మారెడ్డి , వెంకట్రామ్ రెడ్డి , రవీందర్ రెడ్డి , హన్మంత్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.