బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని 4 వార్డులో పేదలకోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ల ఫ్లెక్సీకి కాలనీ వాసులు క్షీరాభిషేకం చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డితో కలిసి 40 డబుల్ బెడ్ ఇండ్లనిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో పేదలకు ఇండ్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృషితో 40 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు ఇచ్చారని తెలిపారు. ఇండ్లను నాణ్యతగా నిర్మించి, పేదలకు అందించాలని సదరు కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మెన్ షేక్ జుబేర్ , కోఆప్షన్ సభ్యులు అలీమొద్దీన్ బాబా , మహ్మద్ ఏజాస్, కౌన్సిలర్ గైక్వాడ్ రుక్మిణి , హాకీం , ఆర్పీ వనజ, తదితరులు ఉన్నారు.