Bajireddy Goverdhan | కోటగిరి, ఆగస్టు 26 : మంగళవారం వర్ని చౌరస్తాలో బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి రాజకీయ కక్షతో బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మను దహనం చేశారని, ఇందుకు నిరసనగా కోటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు.
బాజిరెడ్డి గోవర్ధన్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల తాము సైతం వారి దిష్టిబొమ్మలను దహనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, అంజిరెడ్డి, సాయిబాబా, కోటగిరి మండల నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్, వల్లేపల్లి శ్రీనివాసరావు, హకీమ్, నవీన్, కప్ప సంతోష్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, సాయిబాబా, చిన్న అరవింద్, వర్ని ఏజాజ్, దాస్, అజ్మీర్ కిషన్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఏస్ శ్రేణులు పాల్గొన్నారు.
Vemulawada | రంగు నీళ్లతో వీధి కుక్కలకు చెక్..! వేములవాడలో పట్టణ ప్రజల వింత ప్రయోగం
‘విద్యారంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం’
Jobs | నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్లో 376 ఖాళీలు