Jobs | నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (NIC) ఢిల్లీలోని భారత ప్రభుత్వ సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాజీ మంత్రిత్వ శాఖకు చెందింది. ఈ సంస్థ 376 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిని గేట్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది.
పోస్టులు, ఖాళీలు
సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఎ 376 పోస్టులు. వీటిలో.. కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 300, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 26, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ 50 ఖాళీలు ఉన్నాయి. ఇవి గ్రూప్-బి ఎస్ అండ్ టీ (Non-Gazetted)కి చెందినవి.

Nic 376
అర్హతలు
సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు 2024, 25, 26లకు సంబంధించిన గేట్ (GATE) స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్‌లకు 30, ఓబీసీలకు 33, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు, దివ్యాంగులకు 40 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 800. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు.
ఎంపిక
స్టడీ సర్టిఫికెట్స్, గేట్ స్కోర్ కార్డ్, ఇతర డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికయినవారికి నెలకు రూ. 35,400 – 1,12,400 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇతర వివరాలకు వెబ్సైట్ https://recruitment.nic.in చూడండి.