వేములవాడ, ఆగస్టు 26 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని(Vemulawada town) గాంధీ నగర్ వీధిలో ఏ ఇంటి ముందు చూసిన రంగు నీళ్ల డబ్బాలే(Colored water) కనిపిస్తున్నాయి. ఇదేమిటి అబ్బా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా ప్రస్తుతం వీధి కుక్కల(Stray dogs )బాధ నుండి తప్పించుకునేందుకు రంగు నీళ్ల డబ్బాతో వినూత్న ప్రయత్నానికి దిగినట్లుగా తెలిసింది. అయితే వీధి కుక్కలు కాలనీలో విచ్చలవిడిగా తిరుగుతూ ఇంటి ముందున్న చిన్నారులను వృద్ధులను గాయపరచడమే కాకుండా ఇంట్లోకి చొచ్చుకు వస్తున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇంటి ముందు ఈ రంగు నీళ్ల డబ్బా పెట్టడంతో ఇంటి వైపు కుక్కలు రావడం లేదని ప్రస్తుతం ప్రశాంతంగా ఉంటున్నామని కాలనీవాసులు వెల్లడించారు. శునకాల బాధకు రంగు నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా ప్రతి ఇంటి ముందు రంగు నీళ్ల డబ్బా దర్శనం ఇస్తోంది.