Machareddy : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆంజనేయులు బాబు యాదవ్ (Anjaneyulu Babu Yadav) గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన పదిమంది వార్డు సభ్యులుగా విజయం సాధించారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని మాజీ జెడ్పీటీసీ మినుకూరు రామిరెడ్డి శాలువాలతో సన్మానించి, అభినందించారు.
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి సహకారంతో ఇంతటి భారీ విజయం సాధించామని రామిరెడ్డి పేర్కొన్నారు. ఈఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులకు, పార్టీగా పెద్ద విజయాన్నందించిన గ్రామ ప్రజలకు రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.