Get together | కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-08 చదివిన పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో కలుసుకున్న పాత స్నేహితులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
యోగక్షేమాలను ఆరా తీయడంతో పాటు ఎవరెవరు ఏం చేస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతస్థాయికి ఎదగడానికి కారణమైన ఉపాధ్యాయులను సన్మానించుకున్నారు.