కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో ఓ వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టిన విషాద ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఈరోల్ల మల్లయ్య (62) అనే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో మంత్రాలు చేస్తున్నాడని నెపంతో మండల చెందిన ముగ్గురు వ్యక్తులు
బండరాళ్లతో బాది, పెట్రోల్ పోసి నిప్పంటిండంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
దుండగులు మృతుని భార్య పై కూడా దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.