హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఈనెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతిభ, పారదర్శకతలే ప్రమాణికంగా సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందని, గతంలో జ్యూరీ అవార్డుల ఎంపిక గొప్పగా నిర్వహించి అభినందనలు పొందిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్‌బాబు, సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, కేఎస్ రామారావు, రోజా రమణి, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.