హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొన్న కాంగ్రె స్.. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ న్యా యస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ విమర్శించారు. గురువారం కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ కేసులో స్పీ కర్ ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు. కడియం తరఫున హాజరైన అ డ్వొకేట్ సమయం కోరడంతో విచారణను ఈ నెల 19కి వా యిదా చేశారు.
అనంతరం వివేకానందగౌడ్ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ విచారణకు పిటిషనర్ అయిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరుకాకపోవడం కాంగ్రెస్‌ను కాపాడేందుకేననే విషయం ప్రజలకు అర్థమవుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు బీఆర్ఎస్ ఆధారాలు సమర్పించినా, స్పీకర్ మాత్రం క్లీన్చిట్ ఇవ్వడం దుర్మార్గమని మండిప డ్డారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్‌పై ఎంపీగా పోటీచేసినా అనర్హత వే య రా? అని నిలదీశారు. స్పీకర్ న్యాయం చే యకపోయినా కోర్టులో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉన్నదని తెలిపారు.