పొఖార (నేపాల్): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) అండర్-19 ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో భారత్, బంగ్లా ఫైనల్ చేరాయి. నేపాల్‌లోని పొఖారలో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా తమ ఆఖరి మ్యాచ్‌లో భారత్.. 8-0తో భూటాన్‌ను చిత్తుచేసి ఫైనల్ చేరింది.
పీర్ల్ ఫెర్నాండెజ్ (16, 39, 41 నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ కొట్టగా ప్రీతిక బర్మన్ (25, 90) రెండు గోల్స్ చేసింది. అలీషా (6), అభిష్ట (10), దివ్యాని (17) తలా ఒక గోల్ చేశారు. మరో సెమీస్‌లో బంగ్లాదేశ్.. 4-0తో నేపాల్‌ను ఓడించింది.