ఎల్లారెడ్డి రూరల్, మే 29: ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. బాధిత కుటుంబీకులు శోకసంద్రంలో మునగగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లారెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన గూల విఠల్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
పెద్ద కుమారుడు లండన్‌లో ఉంటున్నాడు. చిన్న కుమారుడు గూల గోవర్ధన్ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం రెండున్నరేండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. గూల గోవర్ధన్ ఈ నెల 27న మృతి చెందినట్లు సమాచారం కుబుంబీకులు వచ్చింది. దీంతో కుటుంబీకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే గోవర్ధన్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.