purchasing center | పెద్ద కొడప్గల్: మే 02: పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పిట్లం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జొన్నల కొనుగోలు కేంద్రాని తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ procurment మేనేజర్ చంద్ర శేఖర్ శుక్రవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో జొన్న తేమశాతం, రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. FAQ ప్రకారం జొన్నలను కొనుగోలు చెయ్యాలని, గన్నీ బస్తాలు కూడా విడతల వారిగా పంపుతున్నామని తెలిపారు. రైతులు తప్పనిసరిగా జొన్నలను చెన్నిపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ డీఎం మహేష్ కుమార్, అధ్యక్షులు కే హన్మంత్ రెడ్డి, చందు, సెక్రటరి బీ సందీప్ కుమార్, రైతులు పాల్గొన్నారు.