Indiramma House | కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు.. లబ్ధిదారురాలికి కాంగ్రెస్ నాయకుడి వేధింపులు
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి, దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది.
Indiramma House | కామారెడ్డి : ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి, దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం రాజంపేట మండల కేంద్రం చెందిన ఒక మహిళకు ఇందిరమ్మ ఇండ్లు కావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన సదరు నాయకుడిని సంప్రదించింది. అయితే ఇల్లు మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలని, తనకు లొంగిపోవాలని అతడు ఆమెను తీవ్రంగా వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు చివరికి రాజంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి రాతపూర్వక ఫిర్యాదు మేరకు సదరు కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశాం
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మహిళపై అసభ్యంగా ప్రవర్తించినందుకు, పలువురిని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణ రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బెస్ట్ చంద్రంను పార్టీ అధిష్టానం మేరకు వాటి నుండి సస్పెండ్ చేశామని రాజంపేట మండల అధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

