నిజామాబాద్ కల్చరల్, అక్టోబర్ 25: శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాండు మేళాలతో శోభాయాత్ర నిర్వహించారు.
కోటగల్లీ మార్కండేయ మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర, గాయత్రీనగర్, వర్ని చౌరస్తా, ఖిల్లా, అర్సపల్లి, జాన్కంపేట మీదుగా బాసర గోదావరి వరకు నిర్వహించారు. అనంతరం గోదావరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేశారు.