బాన్సువాడ, మార్చి 23: పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ లో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతారని తెలిపారు. ఇఫ్తార్ కార్యక్రమానికి ముస్లింలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.