MLA Venkataramana Reddy | కామారెడ్డి : మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా.. దొంగతనంగా కామారెడ్డి మున్సిపాలిటీని గెలిచానని విర్రవీగడం సరికాదని, తనపై తప్పడు ఆరోపణలు చేస్తే భరతం పట్టుడేనని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటరమణారెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ తనను ప్రతీసారి ఏదో విషయంలో గెలుకుతున్నాడని, ఆయనకు భవిష్యత్లో తగిన బద్ది చెబుతానని హెచ్చరించారు. షబ్బీర్ అలీ గతంలో దొంగసారా అమ్మేవాడని ఆరోపించారు. కాగా అప్పటి వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పారు. 1989లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఆయన ఆస్తులు పెరిగాయని, 1989లోని ఆస్తి, ప్రస్తుత ఆస్తీ ఎంత ఉందో ప్రజలందరికీ తెలుసని చెప్పారు.
షబ్బీర్ అలీ ఐదు అంతస్తుల ఇల్లు కట్టాడని, ఫైర్ ఇంజన్ కూడా తిరగడానికి వీలు లేకుండా ఉందని పేర్కొన్నారు. ఈ విషయం తప్పని అంటే తన భార్యా పిల్లలతో గుడికి, లేదా, మసీదుకు రావవాలని, తాను కూడా తన కుటుంబంతో వస్తానని సవాల్ విసిరారు. కామారెడ్డిలో తనతో పాటు తన తమ్ముడు కూడా కబ్జాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో బయట పెడతానని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే భరతం పడతానని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు ఆకుల సుజిత్, లక్ష్మారెడ్డి, మోటోరి శ్రీకాంత్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.