ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మొదలైన జోరువాన శనివారం కూడా కొనసాగింది. నిజాంసాగర్, బీర్కూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్సువాడ, బోధన్, రుద్రూ ర్, చందూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, డిచ్పల్లి తదితర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
జోరువానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగు లు పొంగి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. పిడుగుపడి వైరు తెగి ఇంటిపై పడడంతో ఓ యువతి మృతి చెం దింది. మరోచోట పిడుగు పడి వృద్ధుడు గాయపడ్డాడు. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవుపల్లిలో అత్యధికంగా 13.7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
బొప్పాస్పల్లిలో పిడుగు పడి చవాన్ చిమ్యా నాయక్ (65) తీవ్రంగా గాయపడ్డాడు. పశువులు మేపడానికి అడవికి వెళ్లిన ఆయన పిడుగుపాటుకు గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతడ్ని బాన్సువాడ దవాఖానకు తరలించారు.
ఖలీల్వాడి, ఆగస్టు 31: అల్పపీడనం వల్ల నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వర్నిలో 8,4 సెం.మీ, చందూరు 6.6, మోస్రా 3.38, ఎడపల్లిలో 2.83 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.