సిరికొండ, ఏప్రిల్ 3: వరి కొయ్యలకు నిప్పుపెట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లాయిడి కిషన్(45) పోత్నూర్ గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ భూమిలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడానికి గురువారం సాయంత్రం వెళ్లాడు. వరి కొయ్యలకు నిప్పుపెడుతుండగా ప్రమాదవశాత్తు కిషన్‌కు మంటలు అంటుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రియినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు శుక్రవారం ఉదయం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూడగా కిషన్ మృతదేహం కనిపించింది. కిషన్ భార్య లాయిడి లత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని శవ పంచనామా కోసం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారు కౌశిక్, కూతురు హర్షిణి ఉన్నారని పేర్కొన్నారు.