భిక్కనూరు, ఏప్రిల్1: భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్లు తాళం వేశారు. మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని రూ.20 లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఇందుకు సంబంధించిన బిల్లులు రూ.10 లక్షలు ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బుధవారం విద్యార్థులను బయటికి పంపించి పాఠశాలకు తాళం వేశా రు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లి దం డ్రులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తు లు అధికారులను కోరారు. ఈ విషయమై కాంట్రాక్టర్ను వివరణ కోరగా, రూ.20 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలకు సం బంధించిన బిల్లులు ఇంకా రూ. 10 లక్షల వరకు పెండింగ్ ఉన్నాయని తెలిపాడు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.