రామారెడ్డి(సదాశివనగర్), మే 8: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని సూచించారు. శుక్రవారం ఆయన సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
అనంతరం నిజామాబాద్ వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఉన్న సదాశివనగర్ మండల బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడారు. రైతులకు అండగా నిలువాలని సూచిస్తూ, రెండేండ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తంచేశారు. బాజిరెడ్డిని కలిసిన వారిలో గాంధారి బీఆర్ఎస్ నాయకులు, సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు, శివాజీరావు, సుధాకర్‌రావు తదితరులు ఉన్నారు.