Bodhan | శక్కర్ నగర్ : భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులేటి గోపి కిషన్ ను నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు అందజేశారు. గోపి కిషన్ గతంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయగా గత ఎమ్మెల్యే ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఆయన చేసిన కృషిని గుర్తించిన పార్టీ జిల్లా నాయకులు ఆయనకు పట్టణ బాధ్యతలను అప్పగించారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో బీజేపీలో స్థానాలకు నూతన అధ్యక్షులను నియామకం చేశారు.
ఇందులో భాగంగా బోధన్ పట్టణ అధ్యక్షుడిగా గోపి కిషన్ నియామకం చేశారు. ఈ సందర్భంగా గోపి కిషన్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించి, తన పేరును ప్రతిపాదించిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, కార్యదర్శి సుధాకర్ చారి, నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి ,అడ్లూరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, రంగారావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చెందుకు తనవంతు కృషి చేస్తానని, ఇందుకుగాను పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సహాయ సహకారాలు తీసుకుంటానని అన్నారు.