రవీంద్రభారతి, మార్చి15: యాదవులను చిన్నచూపు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టాన్ని పాలించే అర్హత కోల్పోయారని, తక్షణమే యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతామని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్‌కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో నిర్వహించిన యాదవ మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రూ.10వేల కోట్లతో యాదవులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పదవుల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. యాదవులకు గతంలో ఉ్న ఎస్ఎన్టీ రిజర్వేషన్లను అమలు చేయాలని, కోకాపేటలో ఏర్పాటు చేస్తున్న యాదవ ఆత్మగౌరవ భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.
42శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి యావత్తు బీసీ సమాజాన్ని నమ్మించి గొంతుకోశారని అజయ్‌కుమార్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్‌యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లి చంద్రశేఖర్‌యాదవ్, గంగుల మధుయాదవ్, మేకల శివశంకర్‌యాదవ్, లీగల్‌సెల్ కన్వీనర్ పొన్నం రవీందర్‌యాదవ్, అంజియాదవ్, బెల్లి మధుకర్‌యాదవ్, డాక్టర్ శ్రీనివాస్‌యాదవ్, నక్క ఉమేష్‌యాదవ్, నక్క శ్రీనివాస్‌యాదవ్, నక్క మహేష్‌యాదవ్, విజయ్‌కుమార్ యాదవ్, ఓర్గుగంటి వెంకటే శ్వర్లు యాదవ్, ప్రొఫెసర్లు పర్వతాలు యాదవ్, రాము, న్యాయవాదులు అరుణ్ కుమార్ యాదవ్, నాగుల శ్రీనివాస్‌యాదవ్, ఉద్యోగసంఘాలు, మేధావులు, నిరుద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.